Home » Ganesh Chaturthi
ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతి వద్దకు వస్తుంటారు. ఇక వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 3 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈసారి ఇంతకు మించి భక్తులు వస్తారనే అంచనాల నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి వద్ద పోలీసులు ఎప్పుడూ లేనంత బందోబస్తును నిర్వహించనున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మహారాష్ట్ర బ్యాండ్ నిలిచింది. ఇంతకాలం ఎంతో అపురూపంగా తయారైన ఖైరతాబాద్ గణేశుడు ఇవాళ భక్తులకు దర్శనమిస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది.
రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గణేశ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గణేశ్ ఉత్సవాలు- 2025 సన్నాహక సమావేశం మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగింది.
గణేశ్ నవరాత్రుల సందర్భంగా సెక్టార్ ఎస్‌ఐలు తమ పరిధిలో ఏర్పాటు చేసిన మండపాల పూర్తి వివరాలు సేకరించి జియో ట్యాగింగ్ చేయాలని నగర సీపీ సీవీ ఆనంద్ సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాము అనుకున్న ఎత్తులో మట్టి ప్రతిమలు లభ్యం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే మండపాల్లో కొలువుదీరుస్తున్నారు.
Ganesh Immersion 2024: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణేష్ శోభా యాత్ర కొనసాగుతోంది. అర్ధ రాత్రి తర్వాత కలశ పూజ అనంతరం ఖైరతాబాద్ గణేశుడు భారీ ట్రాలీపైకి ఎక్కాడు. మొత్తం రెండున్నర కిలో మీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర కొనసాగనుంది. 70 ఏళ్ల సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో ఏర్పాటైన మట్టి గణేష్ విశిష్ఠ పూజలు అందుకున్నాడు.
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనంలో భాగంగా వినాయకుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. వినాయకుడిని నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపుపై ఓ వర్గం రాళ్ల దాడికి దిగింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు సైతం ఎదురు దాడికి దిగారు. దాంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.
బాలాపూర్ గణపతి లడ్డూ(Balapur Ganapati Ladoo) వేలానికి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 1980లో ఉత్సవాలు ప్రారంభం కాగా, వేలం మాత్రం 1994లో మొదలైంది.