Maharashtra: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసులు లాఠీ చార్జి
ABN , Publish Date - Sep 18 , 2024 | 11:27 AM
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనంలో భాగంగా వినాయకుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. వినాయకుడిని నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపుపై ఓ వర్గం రాళ్ల దాడికి దిగింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు సైతం ఎదురు దాడికి దిగారు. దాంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.
ముంబయి, సెప్టెంబర్ 18: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనంలో భాగంగా వినాయకుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. వినాయకుడిని నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపుపై ఓ వర్గం రాళ్ల దాడికి దిగింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు సైతం ఎదురు దాడికి దిగారు. దాంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీ ఛార్జికి దిగారు. దాంతో ప్రజలతోపాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.
Also Read: PM Modi US Tour: ప్రధాని మోదీని కలుస్తా: డొనాల్డ్ ట్రంప్
ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి థానే జిల్లాలోని భివాండిలో మంగళవారం చోటు చేసుకుంది. గుంఘట్ నగర్ నుండి వినాయకుడిని నిమజ్జనం కోసం నదినాక కమ్వారి నది వద్దకు ఊరేగింపుగా భక్తులు తీసుకు వెళ్తున్నారని తెలిపారు. ఆ క్రమంలో వంజరపట్టి నాకా వద్దకు ఊరేగింపు చేరుకుందని చెప్పారు. ఆ సమీపంలోని హిందూస్థాన్ మాసీద్ వద్ద కొందరు యువకులు ఆ ఊరేగింపుపై రాళ్ల రువ్వారని పోలీసులు వివరించారు.
Also Read: Viral Video: ఒక్క రూపాయితో ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్న ఉద్యోగి
అయితే ఈ ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని ఓ వర్గం డిమాండ్ చేస్తుంది. అంత వరకు ఈ గణేశుడి నిమజ్జనం జరుపబోమని సదరు వర్గం స్పష్టం చేసింది. ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్ చౌగులే తన అనుచరులతో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘర్షణకు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక శివాజీ చౌక్ వద్ద తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. భివాండిలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అందులోభాగంగా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భివాండిలో ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. వినాయక చవితి ప్రారంభమైన అనంతరం కర్ణాటకలోని నాగమంగళ పట్టణంలో సైతం దాదాపు ఇదే తరహా ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
For More National News and Telugu News