Home » Goldsilver Price
కొంత కాలంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Prices Today) నాలుగైదు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ(మే 5)న ధరలు స్థిరంగా కొనసాగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది.
దేశంలో పుత్తడి(gold) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(మే 4న) పసిడి ధర దాదాపు 500 రూపాయలకు పైగా తగ్గింది. శుక్రవారం సాయంత్రం ఒకవైపు స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం ఉండగా, మరోవైపు బంగారం ధర కూడా పడిపోయింది. ఈ క్రమంలో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గింది.
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పుత్తడి, వెండి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (మే 3న) బంగారం(gold), వెండి(silver) ధరలలో మళ్లీ పెరుగుదల కనిపించింది. నిన్న భారీగా తగ్గిన పుత్తడి ధర ఈరోజు దాదాపు 500 రూపాయలు పెరిగింది.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1710 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7 వేల 88గా ఉంది. పది గ్రాముల బంగారం ధర 70 వేల 880గా ఉంది. నిన్న బుధవారం నాడు మాత్రం రూ.72 వేల 590గా ఉంది.
గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా పెరిగిన బంగారం(gold) ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లోనూ తగ్గుదల కనిపిస్తోంది. బులియన్ మార్కెట్‌లో కూడా నిరంతర క్షీణత కనిపిస్తోంది. IBJA వెబ్‌సైట్ ప్రకారం మంగళవారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.400 తగ్గి రూ.71963కి చేరుకుంది.
మీరు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం(gold), వెండి(silver)ని కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్న పుత్తడి, వెండి రేట్లు ఈరోజు( ఏప్రిల్ 30, 2024న) కూడా తగ్గాయి.
గత మూడు నాలుగు వారాలుగా నిరంతరంగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈ వారం స్వల్పంగా తగ్గాయి. ఈరోజు మాత్రం పుత్తడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.74,660గా ఉంది.
బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పుత్తడి ధరలు క్రమంగా తగ్గగా, ఆ తర్వాత మాత్రం ప్రతిరోజు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు (ఏప్రిల్ 27న) కూడా పసిడి ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశంలో బంగారం ధర గత 24 గంటల్లో రూ.440 పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశంలో బంగారం(gold) ధర దాదాపు 200 రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74680 ఉండగా, ప్రస్తుతం అది రూ.74410కి చేరుకుంది.
విశ్వవ్యాప్తంగా పసిడికి ఎనలేని ఆదరణ ఉంది. ఇందుకు భారత్ మినహాయింపేమీ కాదు. భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. నగలు, ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగానూ పరిగణిస్తుంటారు. దేశంలో పురాతన కాలం నుంచి నేటి వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్థోమతకు తగ్గట్టు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.