Home » Gummanur Jayaram
Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం ఆలూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల.. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి మీద చిత్తశుద్ది లేదని విమర్శించారు. ‘‘ఇదే ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. ఇక్కడ చెత్త తీసి వేరే చోటకి పంపాడట. ఈ నియోజకవర్గానికి పనికి రాడని వేరే నియోజక వర్గం ఇచ్చాడట’’...
Shock To YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSR Congress) అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. టికెట్లు దక్కలేదని కొందరు.. వేరే పార్టీ నుంచి వచ్చి టికెట్ ఆశించిన మరికొందరు.. సిట్టింగ్‌లు, ఇలా ఒక్కొక్కరుగా జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్యనేతలు అటు నుంచి ఇటు వచ్చేయగా..
టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు ఆశావహులంతా క్యూ కట్టారు. రెండో జాబితా సిద్ధమవుతోందన్న వార్తల నడుమ తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆశావహులంతా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను కలుస్తున్నారు. చంద్రబాబు నివాసానికి కళా వెంకట్రావు, సోమిరెడ్డి, గుమ్మనూరు జయరాం.. గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు వచ్చి ఆయన్ను కలిశారు.
ఈరోజు మంగళగిరిలో నిర్వహించిన బీసీ సదస్సులో మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ) తెలుగుదేశం(TDP) పార్టీలో చేరారు. అయితే ఈ విషయంలో ఊహించిందే జరిగింది. జయరాంను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని వైసీపీ అధిష్ఠానానికి తెలిపారు.
TDP Jayaho BC Sabha: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీలో రాజకీయం రక్తికట్టిస్తోంది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి వసల పరంపర కొనసాగుతోంది. తాజాగా వైసీపీ కీలక నేత, మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ).. సీఎం జగన్‌కు(CM YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు. అమరావతిలో టీడీపీ(TDP), జనసేన(Janasena) సంయుక్తంగా నిర్వహిస్తున్న బీసీ జయహో సదస్సు ప్రాంగణానికి వచ్చారు మంత్రి గుమ్మనూరు జయరాం. సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబుకు(Chandrababu) పుష్పగుచ్చం అందజేసి..
వైసీపీకి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని.. మంత్రి పదవి చేశానన్నారు. ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానన్నారు. చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ సదస్సులో టీడీపీలో చేరుతున్నానని గుమ్మనూరి ప్రకటించారు
వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవికి పార్టీకి నేడు ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలోనే గుమ్మనూరు జయరాం విజయవాడకు చేరుకున్నారు. ఆలూరు నుంచి భారీ కాన్వాయ్‌తో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు.
వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పు ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి వైసీపీ నేతలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మూడో జాబితాను సిద్ధం చేయడంపైనే పూర్తి దృష్టి సారించారు. ఈ మూడో జాబితాలో ఎవరెవరని సాగనంపుతారోనని నేతలంతా భయాందోళనకు గురవుతున్నారు
ఆంధ్రజ్యోతి విలేకరి శివపై మంత్రి జయరాం అనుచరులు దాడి చేశారు. విలేకరిపై విచక్షణ రహితంగా మానవత్వం లేకుండా దాడి చేశారు. ఈఘటనలో విలేకరికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. జిల్లాలోని కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు.
ఆలూరులో మంత్రి గుమ్మనూర్ జయరామ్ వర్గీయుడి ఓ వ్యక్తిని బెదిరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. సోషల్ మీడియాలో ఆయన బెదిరింపులకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారింది.