AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్..
ABN , Publish Date - Apr 02 , 2024 | 11:11 AM
Shock To YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSR Congress) అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. టికెట్లు దక్కలేదని కొందరు.. వేరే పార్టీ నుంచి వచ్చి టికెట్ ఆశించిన మరికొందరు.. సిట్టింగ్‌లు, ఇలా ఒక్కొక్కరుగా జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్యనేతలు అటు నుంచి ఇటు వచ్చేయగా..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSR Congress) అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. టికెట్లు దక్కలేదని కొందరు.. వేరే పార్టీ నుంచి వచ్చి టికెట్ ఆశించిన మరికొందరు.. సిట్టింగ్‌లు, ఇలా ఒక్కొక్కరుగా జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్యనేతలు అటు నుంచి ఇటు వచ్చేయగా.. తాజాగా సీనియర్ మహిళా నాయకురాలు.. ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ గుడ్ బై చెప్పేస్తున్నారు.
ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!
రాజీనామా వెనుక..?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో (Kurnool) వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లా మహిళా అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు సమక్షంలో ఇవాళ పసుపు కండువా కప్పుకోనున్నారు. బొజ్జమ్మతో పాటు ఆమె భర్త రామచంద్ర నాయుడు కూడా టీడీపీలో చేరబోతున్నారు. ఇటీవలే టీడీపీని వీడి బొజ్జమ్మ దంపతులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరినప్పుడు ఆలూరు టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని.. అయితే వేరొకరికి టికెట్ ఇచ్చి తమను మోసం చేశారని కప్పట్రాళ్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. వైసీపీలో చేరికలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం.. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉండటంతో తిరిగి పార్టీలోకి రావడానికి కూడా ప్రధాన పాత్ర పోషించారని తెలుస్తోంది.
గట్టి షాకే!
కాగా.. కప్పట్రాళ్ల ఫ్యామిలీ మొదటి నుంచి టీడీపీలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. వెంకటప్పనాయుడు మరణం తర్వాత ఆమె కుమార్తె బొజ్జమ్మ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. చిన్న చిన్న విబేధాలతో బొజ్జమ్మ టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు. మాటిచ్చిన జగన్ న్యాయం చేయకపోవడంతో అసలు రూపం తెలుసుకున్న కప్పట్రాళ్ల ఫ్యామిలీ మళ్లీ టీడీపీలోకి వచ్చేస్తోందని పార్టీ శ్రేణులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు ఈ చేరిక జగన్‌కు ఒకింత షాకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జడ్పీటీసీగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు టీడీపీకి బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. వైసీపీలో చేరాక.. టీడీపీపై విమర్శలు గుప్పించిన బొజ్జమ్మ.. ఇప్పుడు టీడీపీలోకి వచ్చాక వైసీపీపై ఏం మాట్లాడుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి