Home » Hanuman
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయబరేలిలో మంగళవారంనాడు పర్యటించారు. బచ్రావాన్లోని చురువా హనుమాన్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
కొండగట్టులో కొలువైన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజు మంగళవారం. అలాగే వేసవి సెలవు రావడంతోపాటు హనుమాన్ జయంతికి ముందే స్వామి వారి భక్తులు దీక్షలు విరమిస్తున్నారు.
తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గోవిందరాజ స్వామి హనుమంత వాహనంపై మాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
Telangana: నగరంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిటీలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలు సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో వీర హనుమాన్ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది.
రేపు (మంగళవారం) హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు. రేపు ఉదయం 11:20 గంటలకు ఆంజనేయుని శోభా యాత్ర ప్రారంభం కానుంది.
మందు బాబులకు మళ్లీ షాక్. ఆరు రోజుల వ్యవధిలోనే మద్యం ప్రియులకు అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణలో మంగళవారం (ఏప్రిల్ 23) నాడు నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేది నాడు మద్యం షాపులు, వైన్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఆరు రోజులు తిరగకముందే అంటే రేపు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
హనుమాన్ సినిమా ( Hanuman movie ) వాళ్లు ప్రతి టికెట్ పై 5 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని.. ఇదే స్ఫూర్తితో మరికొంత మంది ముందుకు రావాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ( Kishan Reddy ) పిలుపునిచ్చారు.
అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తెలిపారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ వేడుకలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని చిరంజీవి తెలిపారు.