Hanuman Jayanti 2025: హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:23 PM
Hanuman Jayanti 2025: రేపు ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి జరుగనుంది. ఇప్పటికే చాలా చోట్ల అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంతో పరమ పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున ఏ పనులు చేయాలో.. ఏ పనులు చేయకూడదో తెలుసుకుంటే మంచిది

హిందూ బంధువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటి. రేపు ( ఏప్రిల్ 12 శనివారం) ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ద్రిక్ పంచాంగం ప్రకారం పూర్ణిమ తిధి ఏప్రిల్ 12, శనివారం తెల్లవారుజామున 3.21 మొదలవుతుంది. ఏప్రిల్ 13, ఆదివారం ఉదయం 5.51కి ముగుస్తుంది. రామ భక్తుడ్ని మనసారా పూజిస్తే.. అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అదే వాస్తవం కూడా. ఎంతో పరమ పవిత్రమైన ఈ రోజున ఆంజనేయస్వామి కృప పొందాలంటే.. కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. జయంతి రోజున ఏ పనులు చేయాలి?.. ఏ పనులు చేయకూడదు అన్నది తెలిసి ఉండాలి.
ఏం చేయాలి?..
హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామి అవతారంగా భావించే కోతులకు బెల్లం తినిపించటం వల్ల శుభం కలుగుతుంది.
హనుమాన్ జయంతి రోజు దానాలు చేయటం కూడా మంచిది. దానాలు చేయటం వల్ల మన సమస్యలు తొలికి, ప్రశాంతత లభిస్తుంది.
హనుమంతుడికి సింధూరం అర్పిచటం వల్ల మంచి జరుగుతుంది.
పవిత్రమైన ఈ రోజున శృంగారం, మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
ఎర్రని పూలు, నెయ్యి, నువ్వుల నూనెతో దేవుడికి అర్చన చేయటం వల్ల శుభం కలుగుతుంది.
చేయకూడని పనులు
తామసిక ఆహారమైన మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి.
హనుమాన్ జయంతి రోజు ఏ మూగజీవికి కూడా ఇబ్బంది కలిగించకూడదు.
ఈ రోజున గొడవలకు దూరంగా ఉండాలి. ఎవరినీ అవమానించేలా మాట్లాడ కూడదు.
ఇవి కూడా చదవండి
Crocodile VS Python: పట్టుకున్న మొసలి.. చుట్టేసిన కొండచిలువ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
Minister Lokesh: శనివారం ఇంటర్ ఫలితాలు..