Home » Hardik Pandya
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. గాయం కారణంగా సుదీర్ఘ కాలంపాటు టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్‌లో బరిలోకి దిగాడు.
పలువురు భారత ఆటగాళ్లపై బీసీసీఐ అసంతృప్తితో ఉందా? తమ ఆదేశాలను పాటించకపోవడంపై గుర్రుగా ఉందా? కొంతమంది ఆటగాళ్లు రంజీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యతం ఇవ్వడంపై ఆగ్రహంతో ఉందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి.. హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంపై క్రీడాభిమానులు ఎంతలా మండిపడ్డారో అందరికీ తెలుసు. ఆ ఫ్రాంచైజీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ.. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ సాధించిపెట్టిన రోహిత్‌ని ఎందుకు సారథిగా పక్కకు తప్పించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఇప్పటికే సెలెక్టర్లు ఆ దిశగా కసరత్తులు కూడా మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు కూడా ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందనే అంశంపై తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కావడం ఖాయమైపోయింది.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ హార్దిక్ పాండ్యా ఎప్పుడూ కోలుకుంటాడనే అంశంపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. వచ్చే నెలలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్ నాటికి హార్దిక్ పాండ్యా కోలుకుంటాడని అంతా భావించారు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే పలు రకాల సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారడం పెద్ద చర్చనీయాంశం అయింది.
Gujarat Titans: హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌ను నడిపించే బాధ్యత యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌పై ఉందని అన్నాడు.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను అప్పగించడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం పెద్ద దుమారమే లేపింది. హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్పై దుమ్మెత్తిపోస్తున్నారు.