Rohit Sharma: రోహిత్ స్థానంలో హార్దిక్ అందుకే.. అసలు కారణం బయటపెట్టిన ముంబై ఇండియన్స్ కోచ్
ABN , First Publish Date - 2024-02-06T16:10:49+05:30 IST
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి.. హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంపై క్రీడాభిమానులు ఎంతలా మండిపడ్డారో అందరికీ తెలుసు. ఆ ఫ్రాంచైజీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ.. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ సాధించిపెట్టిన రోహిత్‌ని ఎందుకు సారథిగా పక్కకు తప్పించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి.. హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంపై క్రీడాభిమానులు ఎంతలా మండిపడ్డారో అందరికీ తెలుసు. ఆ ఫ్రాంచైజీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ.. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ సాధించిపెట్టిన రోహిత్‌ని ఎందుకు సారథిగా పక్కకు తప్పించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రెండు సీజన్ల పాటు గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాని భారీ రేటుకి ట్రేడ్ చేసి, ముంబై జట్టుకి కెప్టెన్‌గా నియమించాల్సిన అవసరం ఏంటంటూ నిలదీశారు. ఇప్పటికీ ఈ కెప్టెన్సీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బోచర్ స్పందించాడు. రోహిత్ స్థానంలో హార్దిక్‌ని సారథిగా నియమించడానికి గల కారణాన్ని రివీల్ చేశాడు.
‘‘ఇది పూర్తిగా ఓ క్రికెటింగ్ నిర్ణయం. ఒక ప్లేయర్‌గా హార్దిక్‌ని తిరిగి జట్టులోకి తీసుకోవడం కోసం మేము విండో పీరియడ్‌ని చూశాం. నాకు తెలిసినంతవరకు ఇది ఓ పరివర్తన దశ అని భావిస్తాను. అయితే.. చాలామందికి ఈ విషయం అర్థం కాకపోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. కానీ.. ఆటకు సంబంధించిన విషయాల్లో భావోద్వేగాలను దూరం పెట్టాలి. రోహిత్ స్థానంలో హార్దిక్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అనేది ఒక ఆటపరంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఈ నిర్ణయం.. రోహిత్ శర్మను ఒక ప్లేయర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సహాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇన్నాళ్లూ కెప్టెన్సీ అనే పంజరంలో బందీగా ఉన్న రోహిత్‌ను ఇప్పుడు స్వేచ్ఛగా పరుగులు చేయనివ్వండి’’ అని ఓ స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌లో మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు.
తన భుజాలపై కెప్టెన్సీ బాధ్యత ఉండటం వల్లే రోహిత్ శర్మ గత రెండు సీజన్‌లలో బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయాడని మార్క్ బోచర్ తెలిపాడు. అతడు బ్యాటర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలన్న ఉద్దేశంతోనే.. అతనిపై ఉన్న కెప్టెన్సీ బాధ్యతలను తగ్గించాలని అనుకున్నామని వివరణ ఇఛ్చాడు. దీనికితోడు ఫోటోషూట్స్, ప్రకటనలు వంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. మొత్తంగా చెప్పాలంటే.. రోహిత్‌కు కాస్త రిలీఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అతని స్థానంలో కెప్టెన్‌గా హార్దిక్‌ని నియమించామని మార్క్ బోచర్ చెప్పుకొచ్చాడు. మరి.. ఈ కారణం రోహిత్ శర్మ అభిమానుల్ని సంతృప్తి పరుస్తుందా? లేదా?