Home » Heat
ఉత్తరాది ప్రజలు మూడు రోజుల నుంచి విపరీతమైన వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలు తట్టుకోలేక ఉత్తర ప్రదేశ్‌లో 54 మంది, బిహార్‌లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో చాలా మంది ఆసుపత్రులకు వెళ్లవలసి వస్తోంది. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారిలో అత్యధికులు 60 సంవత్సరాల వయసు పైబడినవారే.
రుతుపవనాలు ఆలస్యంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఎండ మంటలు మండిస్తుందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాలతో పాటు మరో 212 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచనున్నాయి.