Home » Hemant Soren
జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టు లో చేదు అనుభవం ఎదురైంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టును సవాలు చేస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఝార్ఘండ్‌లోని గాండే అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో జేఎంఎం తరఫున మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పోటీ చేస్తున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren) మనీ లాండరింగ్ కేసులో ఆదివారం ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈడీ దర్యాప్తులో టీవీ, రిఫ్రిజిరేటర్‌లు సాక్ష్యాలుగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో ఓ భూ కుంభకోణం వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారంనాడు న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ను కలుసుకున్నారు. సోనియాగాంధీని సైతం కలుస్తున్నట్టు కల్పనా సోరెన్ తెలిపారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాంచీ: మనీ లాండరింగ్ కేసులో జైలుపాలైన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)ను తలుచుకుని ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) కంటతడి పెట్టారు. రాంచీలో జరిగిన జేఎంఎం (JMM) కార్యక్రమంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
భూకుంభకోణం కేసులో మనీలాండరింగ్ కింద అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించారు. రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు సోమవారంనాడు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
భూకుంభ కోణం(Land Scam) కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean)కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈడీ(ED) అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు.