Home » Himachal Pradesh
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆ పరిధిలోని గుళ్లు గోపురాలను సైతం ఆమె చుట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను. కంగనా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో చేస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లో గల మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కంగనా రనౌత్ బరిలోకి దిగారు. కంగనాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.
హరియాణాలో చిన్నారులతో వెళ్తున్న స్కూల్ బస్సు.. డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా పడిన ఘటన మరవకముందే.. హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) భక్తులతో వెళ్తున్న మరో బస్సు బోల్తా పడింది.
హిమాచల్ ప్రదేశ్‌లో లోక్ సభ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. మండి లోక్‌సభ ( Lok Sabha Elections 2024 ) స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున విజయ్ వాడెట్టివార్ పోటీలో ఉన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోవడంపై కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వీ కోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సరైన బలం లేదని, అయినా గెలిచారని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓకే సంఖ్యలో ఓట్లు వస్తే లాటరీ ద్వారా డ్రా తీయడం కరెక్ట్ కాదని అభిప్రాయ పడ్డారు.
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాదిలో వేసవి ( Summer ) తీవ్రత అధికంగా ఉంది. ఉత్తర భారతంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో మంచు కొండల్లో నెలవైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ లో భారీ హిమపాతం సంభవించింది.
'క్వీన్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల విశేషాదారణ చూరగొన్న నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో శుక్రవారంనాడు రోడ్‌షో నిర్వహించారు. ఆమెకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది. తనను ఒక హీరోయిన్‌గానో, స్టార్‌గానో చూడవద్దని, ఒక కుమార్తెగా, సోదరిగా చూడమని ఆమె ఈ సందర్భంగా అందరినీ కోరారు.
లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానం నుంచి సినీ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మండి ఎంపీగా కాంగ్రెస్‌కు చెందిన ప్రతిభా సింగ్ ఉన్నారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కూడా ఉన్నారు. తన వయసు దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె అధిష్టానానికి తెలిపారు. అయితే బీజేపీ అనుహ్యంగా కంగనా రనౌత్ పేరును ప్రకటించడంతో ఆమె నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య ఎస్యూవీ కారు చోరీకి గురయ్యింది. దక్షిణ తూర్పు ఢిల్లీలో గల గోవింద్ పురి ప్రాంతంలో ఉన్న సర్వీసింగ్ సెంటర్ నుంచి కారు దొంగతనం జరిగింది. కారును సర్వీసింగ్‌కు ఇచ్చి డ్రైవర్ తినడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా సర్వీస్ సెంటర్లో కారు కనిపించలేదు.
హిమాచల్ ప్రదేశ్ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఫిర్యాదుతో స్పీకర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును రెబల్ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. సానుకూల తీర్పు రాకపోవడంతో ఆరుగురు రెబల్స్ శనివారం నాడు (ఈరోజు) బీజేపీలో చేరారు.