Bhatti: హిమాచల్‌లో తెలంగాణ విద్యుత్ కేంద్రాలు!
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:29 AM
హిమాచల్‌ప్రదేశ్‌లో 520 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కే ంద్రాలు నిర్మించాలని తెలంగాణ యోచిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం బీవోవోటీ విధానంలో 22 జల విద్యుత్ కేంద్రాలకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆ రాష్ట్ర సీఎంను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జనవరి 30(ఆంధ్రజ్యోతి): హిమాచల్‌ప్రదేశ్‌లో 520 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కే ంద్రాలు నిర్మించాలని తెలంగాణ యోచిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం బీవోవోటీ విధానంలో 22 జల విద్యుత్ కేంద్రాలకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సెలి, మియార్ వ్యాలీల్లో 400, 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణానికి తెలంగాణ ఆసక్తి వ్యక్తీకరించింది.
తెలంగాణ జెన్‌కో అధికారులు ఆ రాష్ట్రంలో పర్యటించి, పరిశీలించారు. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. రెండుచోట్ల ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరిస్తూ లేఖ అందించారు. ఎంవోయూ ముసాయిదా పంపించాలని, దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సుఖుకు భట్టి తెలిపారు.