Home » Hitman
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసిన హిట్‌మ్యాన్ 13 ఫోర్లు, 3 సిక్సులతో 154 బంతుల్లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 12వ సెంచరీ.
ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 12th ఫెయిల్ సినిమాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. సినిమా చూసిన హిట్‌మ్యాన్ చాలా బాగుందంటూ కొనియాడాడు. ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సిద్దమవుతున్నాడు.
Team India captain: ప్రపంచకప్ ముగిసింది. ట్రోఫి గెలిచి ఉంటే ప్రస్తుతం టీమిండియా ఫుల్ జోష్‌లో ఉండేది. కానీ అది జరగకపోవడంతో జట్టులో నైరాశ్యం అలుముకుంది. వీలైనంత త్వరగా ఆటగాళ్లంతా ఫైనల్ ఓటమి బాధ నుంచి బయటపడి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో అందరికీ వస్తున్న అనుమానం ఏంటంటే రాబోయే రోజుల్లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతుడా?..
Rohit sharma Comments: ముచ్చటగా మూడో సారి కప్ గెలవాలనే ఆశ నెరవేరలేదు. మన ఆటగాళ్ల వైఫల్యానికి తోడు అది ఏదో పగబట్టినట్టుగా పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారిపోయాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన కెప్టెన్ ఓటమిని ఒప్పుకున్నాడు.
World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ సాధారణంగానే ఈ మ్యాచ్‌లోనూ తనదైన స్టైలులో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు.
Rohit sharma Records: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో టీమిండియా దుమ్ములేపింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ గెలిచి లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా నిలిచింది. దీంతో 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన రోహిత్ సేన సెమీస్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా 160 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Rohit sharma Records: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. తన అద్బుత కెప్టెన్సీతో ఆకట్టుకుంటూనే బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పవర్‌ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. బౌలర్ ఎంత గొప్పవాడైనా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా వీర బాదుడు బాదుతున్నాడు. అంతకన్నా ముఖ్యంగా వ్యక్తిగత రికార్డులను పట్టించుకోకుండా పూర్తిగా జట్టు కోసం ఆడుతున్నాడు. ఎలాంటి స్వార్థం లేని ఆటను ఆడుతూ జట్టును అన్ని విధాల ముందుండి నడిపిస్తున్నాడు.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లను పూర్తి చేసుకోబోతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా హిట్‌మ్యాన్ ఈ ప్రత్యేక ఘనతను సాధించనున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 47 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 17,953 పరుగులు చేశాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా ఉంది. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి.