Home » Hyderabad
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో టీడీపీ(TDP) బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఆ పార్టీ ఫోర్‌మెన్ కమిటీ సభ్యులు నాగు నగేష్ సూచించారు. ఇక్కడ జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై శాసనమండలి సభ్యుడు శంబిపూర్ రాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేరు పెట్టుకున్న గాడ్సే అని అన్నారు. గాంధీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు.
పొట్టకూటి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ముగ్గురు.. వారి సొంత ఇళ్లు నిర్మించుకోవాలనుకున్నారు. అందుకు తగినంత డబ్బులు లేకపోవడంతో ఏదైనా దొంగతనం చేసి డబ్బులు సంపాదించి ఊరిలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
నగరంలోని కొన్ని మెట్రో రైల్వేస్టేషన్ల వద్ద ఆకతాయిల బెడద ఎక్కువవుతోంది. దీంతో ప్రయాణికులు తీవంగా ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ ఆకతాయిల వల్ల ప్రధానంగా మహిళా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా వారు సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. సందీప్ కుమార్‌యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహాయో వెళ్లాడు. అయితే.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)లో రోగులకు శాపంగా మారుతోంది. ఇప్పటికే పారిశుధ్యం అధ్వానంగా మారగా, పందికొక్కులు వార్డుల్లో దర్జాగా తిరుగుతున్నాయి. ఔట్‌పేషెంట్ (ఓపీ) భవనంలోని అత్యవసర విభాగానికి ఆనుకొని కొంతమంది రోగులు సోమవారం రాత్రి నిద్రిస్తుండగా కొన్ని పందికొక్కులు సంచరించాయి.
అరవై గజాల స్థలంలో నిర్మించిన ఓ ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. పక్కనే సెల్లార్ కోసం తవ్వడంతో ఈ భవనానికి ముప్పు ఏర్పడింది. దానికే కాదు. పక్కనే ఉన్న మరిన్ని భవనాలకూ ప్రమాదం ఏర్పడింది. భవనం ఓ వైపు ఒరగగానే అందులో నివాసం ఉంటున్న వారందరూ భయంతో పరుగులు తీశారు.
మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్ సబ్‌స్టేషన్(Banjara Hills Substation) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏడీఈ జీ గోపీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైటెక్ థియేటర్, జూబ్లీహిల్స్(Hi-Tech Theater, Jubilee Hills) ఫీడర్ల పరిధిలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఇమేజీ గార్డెన్స్, సిలికాన్ వ్యాలీ, యూకో బ్యాంక్ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని ఏడీఈ తెలిపారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(Kutubullapur MLA KP Vivekanand) పీఏ బండ మల్లేష్ పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే దామోదర్ ఈనెల 16వతేదీన జీడిమెట్ల(Jeedimetla) పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదుచేశారు.
రామంతాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో శ్రీనివాసపురంలోని వివిధ ప్రాంతాలలో ఈనెల 19న మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్ ఉండబోదని సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ కె.లావణ్య(Transco AE K. Lavanya) ఒకప్రకటనలో తెలిపారు.