Share News

Hyderabad: ‘ఉస్మానియా’లో పందికొక్కులు

ABN , Publish Date - Nov 20 , 2024 | 07:09 AM

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)లో రోగులకు శాపంగా మారుతోంది. ఇప్పటికే పారిశుధ్యం అధ్వానంగా మారగా, పందికొక్కులు వార్డుల్లో దర్జాగా తిరుగుతున్నాయి. ఔట్‌పేషెంట్‌ (ఓపీ) భవనంలోని అత్యవసర విభాగానికి ఆనుకొని కొంతమంది రోగులు సోమవారం రాత్రి నిద్రిస్తుండగా కొన్ని పందికొక్కులు సంచరించాయి.

Hyderabad: ‘ఉస్మానియా’లో పందికొక్కులు

- అత్యవసర విభాగం వద్ద సంచారం

- సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌

- ఆస్పత్రిని పరిశీలించిన కమిషనర్‌ కర్ణన్‌

- సూపరింటెండెంట్‌, అధికారులపై ఆగ్రహం

హైదకాబాద్: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)లో రోగులకు శాపంగా మారుతోంది. ఇప్పటికే పారిశుధ్యం అధ్వానంగా మారగా, పందికొక్కులు వార్డుల్లో దర్జాగా తిరుగుతున్నాయి. ఔట్‌పేషెంట్‌ (ఓపీ) భవనంలోని అత్యవసర విభాగానికి ఆనుకొని కొంతమంది రోగులు సోమవారం రాత్రి నిద్రిస్తుండగా కొన్ని పందికొక్కులు సంచరించాయి. ఈ దృశ్యాలను రోగుల సహాయకులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ ఏరియాల్లో.. ఉదయం 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..


ఈ విషయం ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ కర్ణన్‌(Family Welfare Commissioner Karnan) దృష్టికి రావడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన ఆస్పత్రి అత్యవసర విభాగాన్ని పరిశీలించి వీడియోకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఆయా విభాగాల్లో పెస్ట్‌ కంట్రోల్‌, శానిటేషన్‌ తీరుపై అసహనం వ్యక్తం చేయడంతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేష్‌ సహాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించి వెళ్లిపోయారు. కాగా, పందికొక్కుల సంచారంపై అధికారులు సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టారు. నిజంగా పందికొక్కులు సంచరించాయా? లేదా పాత వీడియోను వైరల్‌ చేశారా? అని ఆరాతీస్తున్నారు.


ఉన్నతాధికారులు ఆదేశిస్తేనే..

సెక్యూరిటీ జీతాలు మొదలుకొని.. తాజాగా పందికొక్కుల సంచారం వరకు ఉన్నతాధికారులు ఆదేశిస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రోగులకు బెడ్లు దొరకడం లేదని ఆందోళన చేస్తే నేలపై పరుపులు వేసి సేవలందించాలని అధికారులు చెబితే గాని ఇక్కడి సిబ్బందిలో చలనం రాలేదు. సామాజిక మాధ్యమాల్లో పందికొక్కుల వీడియోలు వైరలైనప్పటికీ ఉన్నతాధికారులు ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టే వరకు అధికారులకు విషయం తెలియకపోవడం గమనార్హం.


ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు

ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా..

ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 20 , 2024 | 07:41 AM