Home » I.N.D.I.A
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం లేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభలో సమర్పించాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఈ నోటీసులను ఇచ్చారు. వీటిని బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ సభాపతి ఓం బిర్లా పరిశీలిస్తారు.
మొత్తం 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి (I.N.D.I.A) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని (No Confidence Motion) నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు సోమవారం రాత్రంతా బృందాల వారీగా ధర్నా చేశారు. పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది.