Home » ICC
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ టీ 20 ఉమెన్స్ వరల్డ్ కప్ వేదిక మారింది. బంగ్లాదేశ్‌లో టోర్నమెంట్ నిర్వహణకు వివిధ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో మంచి అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది. వేదిక కోసం శ్రీలంక, జింబాబ్వే పోటీ పడ్డాయి. ఐసీసీ పాలకవర్గం మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు మొగ్గు చూపించింది. యూఏఈలో నిర్వహిస్తామని ప్రకటన చేసింది.
బంగ్లాదేశ్(bangladesh)లో ఆందోళనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచ కప్ 2024(Women's T20 World Cup 2024) ఎక్కడ జరుగుతుందనే చర్చ మొదలైంది. అందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. అయితే భారత్ నిర్వహించాలని కోరగా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ జై షా నిరాకరించారు.
వచ్చే ఏడాదిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం ఎనిమిది దేశాలు ఈ మెగా టోర్నీలో పాల్గొనబోతున్నాయి. అయితే.. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా?
ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్‌కు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ రాలేదు. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. రూ.167 కోట్ల మేర ఐసీసీ నష్టపోయిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం దాదాపు అసాధ్యమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ టోర్నీ పాక్‌లో జరగాల్సి ఉంది. అయితే 8 జట్లు పాల్గొనే ట్రోఫీ ముసాయిదా షెడ్యూల్‌ను పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. దీని ప్రకారం భారత జట్టు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ఆ టోర్నీ ఆడేందుకు పాక్ గడ్డపై భారత్ అడుగుపెడుతుందా? అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇప్పటికే..
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్ దశలో తలపడ్డ భారత్, పాకిస్తాన్ జట్లు.. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమవుతున్నాయి. అమీతుమీ తేల్చుకునేందుకు త్వరలోనే బరిలోకి దిగబోతున్నాయి.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20I ర్యాంకింగ్స్‌లో అతను అగ్రస్థానానికి ఎగబాకాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటికే అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్స్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను..
సుమారు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2013లో చాంఫియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2024లో టీ20 వరల్డ్‌కప్‌ని సొంతం చేసుకుంది. ఇదే ఊపులో..