LA28 Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఐవోసీ క్రేజీ అప్‌డేట్.. మ్యాచులన్నీ అక్కడే
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:35 AM
ICC: వచ్చే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెడుతుండటం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఫస్ట్ టైమ్ విశ్వక్రీడల్లో జెంటిల్మన్ గేమ్‌ను చూసే అవకాశం రావడంతో క్రికెట్ లవర్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఈ తరుణంలో మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది ఐవోసీ. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టెన్నిస్ దగ్గర నుంచి బాక్సింగ్ వరకు.. ఫుట్‌బాల్ నుంచి హాకీ దాకా.. ఒలింపిక్స్‌లో దాదాపు ప్రముఖ క్రీడలన్నీ ఉన్నాయి. కానీ అతిపెద్ద క్రీడల్లో ఒకటైన క్రికెట్‌కు మాత్రం అందులో చోటు లేకపోవడంతో అభిమానులు ఎప్పుడూ బాధపడేవారు. అయితే ఎట్టకేలకు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028లో జెంటిల్మన్ గేమ్‌కు ప్లేస్ దక్కడంతో ఎగిరి గంతేస్తున్నారు. ఈ తరుణంలో దీనిపై మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. వచ్చే విశ్వక్రీడల్లో క్రికెట్ మ్యాచులను ఎక్కడ నిర్వహించనున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఐవోసీ ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యాచుల తేదీలు ఇవే..
వచ్చే ఒలింపిక్స్‌లో అన్ని క్రికెట్ మ్యాచుల్ని సౌత్ కాలిఫోర్నియాలోని పొమోనాలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. 2028 జులై 14 నుంచి 30వ తేదీ వరకు మ్యాచులు ఉంటాయని వెల్లడించింది. అందుకోసం పొమోనాలో పలు తాత్కాలిక స్టేడియాలను నిర్మించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రకటనను ఐసీసీ స్వాగతించింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీకి ఇది దోహదం చేస్తుందని ఐసీసీ చైర్మన్ జైషా తెలిపారు. క్రికెట్ చాలా పాపులర్ గేమ్ అని చెప్పుకొచ్చారు. విశ్వక్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో మ్యాచులు జరగడం వల్ల మరింత మంది నయా ఆడియెన్స్‌కు ఈ గేమ్ చేరువవుతుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు జైషా. కాగా, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు కొత్తగా 4 ఆటల్ని చేర్చారు. బేస్‌బాల్, లాన్‌క్రాస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్ వంటి గేమ్స్‌ను వచ్చే ఒలింపిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఇవీ చదవండి:
ఈ వయసులోనూ.. ఇదేం మ్యాజిక్ అన్నా?
మల్లీశ్వరిని చూసి దేశం గర్విస్తోంది
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి