Home » Income Tax Department
పాన్ మసాలా, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీదారుల కోసం రిజిస్ట్రేషన్, నెలవారీ రిటర్న్ల దాఖలు కోసం ప్రత్యేక ప్రక్రియను అమలు చేయడానికి ప్రభుత్వం మే 15 వరకు గడువును పొడిగించింది. మరోవైపు పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్ను ఫైల్ చేయడం తప్పనిసరి. ఈ గడువు తేదీని ఏప్రిల్ 12 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారు ఉంటే దాఖలు చేయాలని కోరారు.
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. రూ.3,500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24వ తేదీ వరకూ తాము ఎలాంటి చర్చలు తీసుకోమని ఆదాయం పన్ను శాఖ సుప్రీంకోర్టుకు సోమవారంనాడు తెలియజేసింది.
దేశంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(new financial year) రాబోతుంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఎలాంటి కొత్త నిబంధనలు(new income tax rules) అమల్లోకి వస్తాయి, ఇవి సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయం పన్ను అంశంలో ఆ పార్టీకి ఆదాయం పన్ను విభాగం శుక్రవారం నోటీసులు పంపింది. 2017-18, 2021-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1,823 కోట్ల మేర పన్ను నోటీసులు ఇచ్చింది.
MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ఢిల్లీకి తరలిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కవిత ఇంట్లో ఎంత సీన్ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈడీ అనుమతితో కవిత ఇంట్లోకి వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రచ్చ రచ్చ చేశారు.
MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితను అరెస్ట్ చేయడం జరిగింది.
ED Raids On Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి ఈడీ, ఐడీ (ED, IT) రంగం సిద్ధం చేసిందా..? సుదీర్ఘ సోదాల తర్వాత కవితను అదుపులోనికి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అంటే హైదరాబాద్లో ఆమె ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి చూస్తే కచ్చితంగా ఇదే జరగొచ్చని తెలుస్తోంది..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇంటిపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు చేస్తోంది...
లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అకౌంట్లపై ఆదాయం పన్ను శాఖ చర్యను నిలివేయాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది.
మీరు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. ఎందుకంటే ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు దాఖలు చేయాలని..ఇదే చివరి అవకాశమని అధికారులు ప్రకటించారు.