Income Tax alert: మీ భార్య అకౌంట్‌కు ప్రతి నెలా డబ్బులు పంపుతున్నారా? ఈ రూల్ తెలుసుకోకపోతే ట్యాక్స్ తప్పదు..
ABN , Publish Date - Feb 06 , 2025 | 12:43 PM
ఇంటి ఖర్చుల నిమిత్తం లేదా మీ భార్య వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి నెల మీ అకౌంట్ నుంచి మీ భార్య ఖాతాకు డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఆమె ఆ డబ్బులను ఎందుకోసం వాడుతుందో గమనిస్తున్నారా? జాగ్రత్తపడకపోతే మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి పన్ను నోటిసు వచ్చే అవకాశం ఉంది.

ఇంటి ఖర్చుల నిమిత్తం లేదా మీ భార్య వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి నెల మీ అకౌంట్ నుంచి మీ భార్య ఖాతాకు డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఆమె ఆ డబ్బులను ఎందుకోసం వాడుతుందో గమనిస్తున్నారా? జాగ్రత్తపడకపోతే మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి పన్ను నోటిసు వచ్చే అవకాశం ఉంది (Cash transfers to wife). ప్రతి నెలా మీరు పంపిస్తున్న డబ్బును మీ భార్య వేరే ఎక్కడైనా పెట్టుబడిగా పెడితే, దాని ద్వారా వచ్చే ఆదాయంపై కూడా మీరు పన్ను కట్టాల్సి ఉంటుంది. దీనినే క్లబ్బింగ్ రూల్స్ (Clubbing Rules) అంటారు. ఈ క్లబ్బింగ్ రూల్స్ గురించి పూర్తి వివరాలు మీకోసం.. (Income Tax alert)
మీరు మీ సంపాదనలో ప్రతి నెలా యూపీఐ (UPI) ద్వారా మీ భార్యకు డబ్బు పంపిస్తుంటే.. ఆమె ఆ డబ్బులను ఎస్‌ఐపీ (SIP) లేదా మ్యూచువల్ ఫండ్లు, షేర్లు, లేదా ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదిస్తే, ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే డివిడెండ్లు, వడ్డీ, లాభాలను కూడా మీ ఆదాయంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ఆదాయంపై కూడా పన్ను వేస్తారు. అలా కాకుండా లాభాల మీద వచ్చిన ఆదాయాన్ని కూడా ఆమె మళ్లీ పెట్టుబడిగా మారిస్తే ఆ రెండో దశ ఆదాయాన్ని ఆమెకు చెందిన దానిగా పరిగణిస్తారు. అప్పుడు ఆమె పన్ను కట్టాల్సి ఉంటుంది.
కాబట్టి, ప్రతి నెలా మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తున్న డబ్బును మీ భార్య ఎలా వినియోగిస్తోందో తెలుసుకోవడం తప్పనిసరి. ఆమె చేసే పెట్టుబడుల గురించి కూడా మీకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. మీ భార్యకు రూ.20 వేలకు మించి యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయకపోవడం మంచిది. అలాగే ఒకవేళ రూ.20 వేలకు మించి ట్రాన్స్‌ఫర్ చేయదలచుకుంటే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లేదా చెక్కుల వంటి ఇతర మార్గాల ద్వారా చేయడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..