Home » IndiaVsEngland
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆటగాళ్ల గాయాలు టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా మహ్మద్ షమీ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. రవీంద్ర జడేజా ఒక మ్యాచ్‌కు దూరం కాగా.. కేఎల్ రాహల్ 3 టెస్టులకు దూరమయ్యాడు. చివరిదైన ఐదో టెస్టులో ఆడడం కూడా అనుమానంగానే ఉంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని, ధోని తర్వాత అతనే అత్యుత్తమ కెప్టెన్ అని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. ధోని మాదిరిగా రోహిత్ శర్మ కూడా యువ ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇస్తున్నాడని కొనియాడాడు.
గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన గత మూడు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. రాహుల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌కు కూడా రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 3 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. 727 రేటింగ్ పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో 22 ఏళ్ల జైస్వాల్ చెలరేగుతున్నాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 93 సగటుతో 655 పరుగులు చేశాడు.
టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ రీఎంట్రీలో విఫలమయ్యాడు. 3 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న కిషన్ డివై పాటిల్ టీ20 కప్‌లో బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టు తరఫున బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ మంగళవారం ఆర్ఎంఎల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు.
నిన్నమొన్నటి వరకు రంజీ ట్రోఫిలో ఆడకుండా మొండికేసిన టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే రంజీల్లో బరిలోకి దిగనున్నట్టు సమాచారం.
మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024ను దృష్టిలో పెట్టుకుని పలువురు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు ముఖ్యంగా రంజీ ట్రోఫికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులువేస్తోంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో యువ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత జట్టు విజయాన్ని అందుకుంది.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. కాలి చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం ఎంతకీ తగ్గకపోవడంతో తాజాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.