Home » Israel
ఇరాన్(Iran) శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్(Israel)పై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడి(attack) చేసింది. ఆ తర్వాత అమెరికా సహా అగ్రదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చాయి. శనివారం అర్థరాత్రి ఇరాన్ దాడి చేసి వందల కొద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో ఇరాన్‌పై "అన్ని విధాలుగా ఆంక్షలు" విధించాలని ఇజ్రాయెల్ UN ప్రతినిధి ఆదివారం భద్రతా మండలిని కోరారు.
ఇజ్రాయెల్- ఇరాన్(israel-iran) దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ప్రధాన విమానయాన సంస్థలు ఇరాన్‌కు విమానాలను రద్దు చేశాయి. దీంతోపాటు ఇజ్రాయెల్‌కు కూడా గగనతల వినియోగాన్ని పరిమితం చేశాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, విస్తారా విమాన(flights) మార్గాల ప్రయాణంపై ప్రకటనలు విడుదల చేశాయి.
ఇరాన్(Iran) శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్(Israel) భూభాగంపై మొదటి ప్రత్యక్ష దాడిని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై 100కుపైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తీవ్రంగా స్పందించారు.
ఇరాన్(Iran) సైన్యం ఎట్టకేలకు దాదాపు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్(Israel)పై దాడి(attack) చేయడం ప్రారంభించింది. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్థరాత్రి సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఒక బాలిక సహా అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. క్షణక్షణం ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది....
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నారు. ఇజ్రాయెల్‌పై ఇప్పటికే ఆగ్రహంతో రగులుతున్న ఇరాన్ తాజాగా హార్మూర్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎంఎన్సీ ఏరిస్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకోవడం తాజా ఉదిక్రతలకు దారి తీసింది. ఇందులో 17 మంది భారతీయులు ఉన్నట్టు అధికారిక వర్గాల సమాచారం.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్(Israel), హమాస్(hamas) మధ్య హింసాత్మక ఘర్షణ ఆరు నెలలకు పైగా కొనసాగింది. ఈ ఘటనలో ఇప్పటికే 33 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లెబనాన్‌కు(Lebanon) చెందిన హిజ్బుల్లా(Hezbollah) ఉత్తర ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. 48 గంటల్లోగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సమాచారం ఉన్న ప్రతినిధి తెలిపారని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్షంగా దాడి చేస్తే పొంచివుండే రాజకీయ ముప్పులను ఇరాన్ అంచనా వేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు భారతీయ పౌరులెవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని కేంద్ర విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
ఇజ్రాయెల్(Israel)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరోసారి ఊపందుకున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని( Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) రాజీనామా(resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆ క్రమంలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.