Home » IT Raids
కర్నాటక: బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. 20 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. మట్టికెరె, బీఎల్ సర్కిల్, ఆర్ఎంవీఎక్స్ స్టేషన్, మల్లేశ్వరం సహా పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో మూడవ రోజు ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ సంస్థలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. అమీర్‌పేట్, కూకట్పల్లి శంషాబాద్‌లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో 100 టీమ్స్‌తో సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలు టార్గెట్‌గా రైడ్స్ కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు 100 టీములతో సోదాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నోటీసులు అనేవి రొటీన్ చర్యగా అభివర్ణించారు. ఇది వరకే ఈడీ అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం అందించినట్లు తెలిపారు. లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉంటామని వివరించారు.
బీఆర్ఎస్ నేతలపై కావాలనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మండిపడ్డారు. సోదాలు చేపట్టిన ఐటీ అధికారులకు అన్ని రకాలుగా సహకరించామన్నారు. వాళ్ళు వచ్చిన గంటన్నరలోపే పూర్తి వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. అయినా మూడురోజులు ఏదో సాధించాలని కాలయాపన చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్థిక లావాదేవీలపై ఐటీ దృష్టి పెట్టింది. సోదాల్లో కీలక మైనా సమాచారాన్ని అధికారులు సేకరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటి వాళ్ళు వస్తారు... చెక్ చేసుకుంటారని అన్నారు. ‘‘మేము చెప్పేది చెబుతాం వాళ్ళు అడిగేది అడుగుతారు.. నా లెక్కలు క్లియర్ గా ఉన్నాయి కడిగిన ముత్యం లా వస్తాం’’ అని చెప్పుకొచ్చారు.
అధికార పార్టీ నేతలపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసంలోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 60 బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. కాగా.. జూబ్లీహిల్స్‌లోని తమ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తల్లి అమృతమ్మ అనారోగ్యానికి గురయ్యారు.