Home » Jaggareddy
కాంగ్రెస్ ప్రభు త్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్ ఉప ఎన్నికలను కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పాలన ప్రజలు మెచ్చే విధంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి 8 నెలల్లో పార్టీ పూర్తి నాయకత్వం ప్రజల్లోనే ఉందన్నారు.
దేశప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం అయ్యారని, ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బీజేపీలో ఎవరికైనా ఉందా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజీవ్ గాంధీ అమరజ్యోతి యాత్ర మంగళవారం సంగారెడ్డికి చేరుకుంది.
క్విటిండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర నూతన ‘ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)’ని పంద్రాగస్టు తర్వాత ప్రకటించనున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసింది.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు, పౌరుషం ఉంటే ITIR మంజూరు చేయించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ITIR శంకుస్థాపన చేయించి బీజేపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.
ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ ఈ మేరకు బడ్జెట్‌ను ఏనాడైనా కేటాయించారా అంటూ నిలదీశారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై హస్తం నేతలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్‌కు ఎన్ని నిధులు ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ నిన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు.
సోనియా, రాహుల్, ఖర్గేల నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యుత్తమంగా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.