Home » Kale Yadaiah
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారికే క్యాబినెట్ మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయని, ఆ రెండు అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి అందించామని చెప్పారు.
ఎమ్మెల్యేలు చేజారకుండా బీఆర్‌ఎస్ అధినాయకత్వం ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నా.. మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి షాకిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం కాంగ్రె్‌సలో చేరారు.
తెలంగాణలో రోజురోజుకూ ‘కారు’ పార్టీ ఖాళీ అవుతోంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన చేరికలు.. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరింత జోరందుకున్నాయి...
BRS MLA Kale Yadaiah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు..