Home » Kanipakam temple
జనవరి ఒకటిన కాణిపాక ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికీ స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో పెంచలకిషోర్ తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు వరసిద్ధుడి ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి(Kanipakam Varasiddhi Vinayaka Swamy) ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు. తన పదోన్నతి కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆలయానికి సమర్పించారంటూ సోమశేఖర్ గురుకుల్పై లాయర్ రవికుమార్ ఆరునెలల క్రితం దేవదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
తమిళనాడులోని అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నికి ఈ క్షేత్రం ప్రతీక. దసరా సెలవుల సందర్భంగా ఆ అరుణాచలేశ్వరుడిని దర్శించుకునే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది.
కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో శనివారం రాత్రి స్వామివారు పుష్ప పల్లకిపై విహరించారు.
కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో శుక్రవారం వరసిద్ధుడు విమాన వాహనంపై విహరించారు.
వినాయక చవితి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి మహానంది దేవస్ధానం తరపున పట్టు వస్త్రాలను గురువారం సమర్పించారు.
Andhrapradesh: వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఊరూవాడా గణనాథుని మండపాలు వెలిశాయి. చవితిని పురస్కరించుకుని వివిధ రకాల గణపయ్యలు భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా గణపతిని తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంటారు.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఉభయ దారుల సమావేశం ఆదివారం నాడు జరిగింది. అయితే ఈ సమావేశం రసాభాసగా మారింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 21 రోజుల పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామి దర్శనానికి ఉదయం నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు.