Share News

Kanipakam: ఉదయం 3 గంటలనుంచే వరసిద్ధుడి దర్శనం

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:57 AM

జనవరి ఒకటిన కాణిపాక ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికీ స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు.

Kanipakam: ఉదయం 3 గంటలనుంచే వరసిద్ధుడి దర్శనం
క్యూలైన్లను పరిశీలిస్తున్న ఈవో పెంచలకిషోర్‌

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జనవరి ఒకటిన కాణిపాక ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికీ స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం, అనంతరం మూల విరాట్‌కు చందనాలంకారం నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నట్లు వివరించారు. జనవరి 1న వేకువ జామున 3 గంటలకే స్వామి దర్శనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఉచిత దర్శనంతో పాటు రూ.100,రూ.150 దర్శన కూలైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భక్తులకోసం 8వేల పెద్దలడ్డూలు, 80వేల చిన్న లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేయడానికి కౌంటర్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.ఈఈ వెంకటనారాయణ, ఏఈవోలు రవీంద్రబాబు,ధనంజయ, హరిమాధవరెడ్డి,ఎ్‌సఐ ధరణీధర, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 01:57 AM