Home » Kaveri River
గోదావరి-కావేరి అనుసంధానంలో తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీల నీటిని కేటాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తోసిపుచ్చింది.
సేలం జిల్లా మెట్టూరు డ్యాం(Mettur Dam) నుంచి గురువారం ఉదయం 2 లక్షల ఘనపుటడుగుల నీటిని కావేరి నది కాలువలోకి విడుదల చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా అక్కడ డ్యాంలు పూర్తిస్థాయిలో నిండి పొంగి పొర్లుతుండడంతో మిగులు జలాలను కావేరి నది(Kaveri river)లోకి విడుదల చేస్తున్నారు.
కేరళ రాష్ట్రం వయనాడ్(Wayanad)లో భారీ వర్షాలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. వయనాడ్ ప్రాంతంలో నిరంతరంగా వర్షాలు హోరెత్తిస్తుండడంతో కావేరి నది(Kaveri river)కి అనుబంధమైన జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. వయనాడ్‌లో కురిసే వర్షం ద్వారానే కావేరి నదికి అనుబంధమైన కేఆర్‌ఎస్, కబిని జలాశయాలకు వరద చేరుతుంది. మరోవైపు రాష్ట్రంలోని కావేరి తీరంతోపాటు మలెనాడు, తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వారాణసిలో గంగా హారతి తరహాలోనే కావేరి నదికి కావేరి హారతి నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) తెలిపారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కేఆర్‌ఎస్ జలాశయాన్ని డీకే సందర్శించారు.
వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.