Share News

Kaveri river: కావేరిలోకి ‘మెట్టూరు’ నీరు..

ABN , Publish Date - Aug 02 , 2024 | 12:22 PM

సేలం జిల్లా మెట్టూరు డ్యాం(Mettur Dam) నుంచి గురువారం ఉదయం 2 లక్షల ఘనపుటడుగుల నీటిని కావేరి నది కాలువలోకి విడుదల చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా అక్కడ డ్యాంలు పూర్తిస్థాయిలో నిండి పొంగి పొర్లుతుండడంతో మిగులు జలాలను కావేరి నది(Kaveri river)లోకి విడుదల చేస్తున్నారు.

Kaveri river: కావేరిలోకి ‘మెట్టూరు’ నీరు..

- దిగువ ప్రాంతాల్లో అప్రమత్తం

చెన్నై: సేలం జిల్లా మెట్టూరు డ్యాం(Mettur Dam) నుంచి గురువారం ఉదయం 2 లక్షల ఘనపుటడుగుల నీటిని కావేరి నది కాలువలోకి విడుదల చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా అక్కడ డ్యాంలు పూర్తిస్థాయిలో నిండి పొంగి పొర్లుతుండడంతో మిగులు జలాలను కావేరి నది(Kaveri river)లోకి విడుదల చేస్తున్నారు. మేట్టూరు డ్యాంకు వస్తున్న 2 లక్షల ఘనపుటడుగుల నీటిని అలాగే 16 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో సేలం జిల్లా కలెక్టర్‌ బృందాదేవి జలవనరులు, ప్రజాపనుల శాఖల ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు.


మరోవైపు కావేరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటక రాష్ట్రం(Karnataka State)లోని డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడున్న కబిని, కృష్ణరాజసాగర్‌ డ్యాంల నుంచి మిగులు జలాలు విడుదల చేస్తున్న కారణంగా కావేరి నది(Kaveri river)లో వరద ఉధృతి ఏర్పడింది. మెట్టూరు డ్యాంకు గత నెల 16వ తేది నుంచి వస్తున్న నీటి పరిణామం క్రమక్రమంగా పెరిగింది. ప్రారంభంలో 43 అడుగులున్న డ్యాం నీటిమట్టం 27వ తేది వందడుగులకు చేరింది. దీంతో డెల్టా జిల్లాకు మరుసటిరోజు నుంచి సాగునీరు విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ, డ్యాంకు చేరుతున్న నీటి పరిమాణం పెరుగుతుండడంతో మేట్టూరు డ్యాం పూర్తిసామర్ధ్యం 120 అడుగులకు చేరింది. ఈ డ్యాం చరిత్రలో 43వ సారిగా 120 అడుగులకు చేరి రికార్డు నెలకొల్పింది. డ్యాంలో ఉన్న 16 గేట్లు ఎత్తేసి బుధవారం సాయంత్రం నుంచి వస్తున్న నీటిని విడుదల చేశారు.


ఆ తర్వాత గురువారం ఉదయానికి విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని 2 లక్షల ఘనపుటడుగులకు అధికారులు పెంచారు. ఇదిలా ఉండగా, కావేరి పరీవాహక డెల్టా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. నీటిలో దిగి స్నానం చేయడం, బట్టలు ఉతకడం, సెల్ఫీ దిగడం ప్రమాదకరమని జిల్లా యంత్రాంగం, మున్సిపాలిటీలు సంయుక్తంగా లౌడ్‌స్పీకర్ల(Loudspeakers) ద్వారా హెచ్చరిస్తున్నాయి. ధర్మపురి జిల్లా హొగెనేకల్‌కు బుధవారం ఉదయం 1.20 లక్షల ఘనపుటడుగుల నీరు చేరిన నేపథ్యంలో, గురువారం ఉదయం 9 గంటలకు 1.70 లక్షలు, సాయంత్రానికి 2 లక్షల ఘనపుటడుగులకు చేరింది. డెల్టా జిల్లాల్లోని తీరప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ, గజ ఈతగాళ్లు, పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

nani1.jpg


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 02 , 2024 | 12:22 PM