Home » KCR
రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ వ్యవహారం ఎమ్మెల్యేల అరెస్టులకు దారితీసింది.
రూ.2 లక్షలు పైన ఉన్న రైతులకు కూడా రుణమాఫీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేశామని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా తెలంగాణలో కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని రైతులు పండిస్తున్నారని వెల్లడించారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
కోమటిరెడ్డి లాంటి నేతలు ఎంతమంది వచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని బీఆర్ఎస్ సీనియర్ నేత గొంగడి సునీత అన్నారు. కోమటిరెడ్డి కుటుంబంలో గొడవలను ఆయన మొదటగా పరిష్కరించుకోవాలని గొంగడి సునీత హితవు పలికారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ ,హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావు వస్తే వీరు జైలుకు పోతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ స్పష్టం చేశారు.
తెలంగాణకు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందో నాయకులు తెలుసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
గాంధీల గురించి ఈ గాడిదలకు ఏం తెలుసు? అంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాణ త్యాగం, పదవుల త్యాగమంటే గాంధీ కుటుంబానిదేనని చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ ముఖ్యనేతలు కలిశారు.
‘‘ప్రత్యర్థి.. నన్ను రాజకీయంగా కత్తితో పొడవాలని వస్తే నేను ఊర్కోను. ఎదురుదాడి చేస్తా. అదే రాజనీతి’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘గత పదేళ్లలో ఒక్క ఎమ్మెల్యేకూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తిగతంగా పార్టీ కండువా కప్పలేదు.