Home » Kejriwal Arrest
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తాను కోరిన ఓ విజ్ఞప్తిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం కొట్టివేసింది.
తనకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైన నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు వెంటనే ఉపశమనం కల్పించాలని కోరారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు అతిశ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌తోపాటు ఆ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
లిక్కర్ స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో ఓ భూ కుంభకోణం వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై ఢిల్లీ మంత్రి అతిషి సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ బీజేపీ రాజకీయ ఆయుధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించి, ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ఈడీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. మరో నాలుగు రోజుల పాటు.. అంటే ఏప్రిల్ 1వ తేదీ వరకూ కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్ట్‌ను, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.