Share News

Kejriwal Arrest: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. ఆ పిటిషన్ తిరస్కరణ

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:34 PM

లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Kejriwal Arrest: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. ఆ పిటిషన్ తిరస్కరణ

లిక్కర్ స్కామ్‌కి (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ఊరట లభించింది. ఈడీ (Enforcement Directorate) కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని పేర్కొన్న హైకోర్టు.. అందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులు ఏంటని ప్రశ్నించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు తీర్పునిచ్చింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పట్టపగలే దారుణ హత్య.. నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ హతం..


మద్యం కేసులో తాను అరెస్ట్ అయిన తర్వాత తన ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ (Kejriwal Arrest) రాజీనామా చేయకపోవడంతో.. సుర్జీత్‌ సింగ్‌ యాదవ్‌ (Surjit Singh Yadav) అనే వ్యక్తి ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిని గురువారం విచారించిన ధర్మాసనం.. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇది న్యాయపరమైన జోక్యం పరిధికి వెలుపల ఉందని తెలిపింది. ప్రాక్టికల్ ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ, సీఎంగా కొనసాగడానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకి ఏంటని కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది.

Lok Sabha Elections: సారీ.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక కాఫీలు మాత్రమే!

ఇదిలావుండగా.. మార్చి 21వ తేదీన అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్, జైలు నుంచే పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు ఆదేశాలను జారీ చేశారు. అయితే.. బీజేపీ (BJP) నేతలు మాత్రం దీనిని ఖండిస్తూ, కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా (VK Saxena) కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) నేతలు అందుకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. తమ ముఖ్యమంత్రి జైలు నుంచే పాలన సాగిస్తారని, అందుకు అడ్డుకోవడానికి ఎలాంటి చట్టం లేదని తేల్చి చెప్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 03:39 PM