Home » Keshav Prasad Maurya
ఉత్తపరప్రదేశ్ బీజేపీలో 'లుకలుకలు' తలెత్తాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పరోక్షంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఇచ్చిన 'మాన్ సూన్ ఆఫర్'ను ఆయన అంతే వేగంగా తిప్పికొట్టారు. మీ మాన్‌సూన్ ఆఫర్‌కు 2027లో ప్రజలే గట్టి జవాబు ఇస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మౌర్య యూపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన ఆయనకు అవకాశం కల్పించవచ్చని చర్చ జరుగుతోంది.