Home » Khammam Floods
ఖమ్మంలో అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
సాగర్ ఎడమకాల్వ రెండోజోన్ పరిధిలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ మధిర బ్రాంచ్ కాల్వకు సత్వరమే సాగునీరు అందించి ఎండిపోతున్న వరి పైరును కాపాడాలని ఆ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Telangana: ఖమ్మం నగరంలో కేంద్ర బృందం గురువారం ఉదయం పర్యటిస్తోంది. బొక్కల గడ్డ, జలగం నగర్, మోతీ నగర్, ప్రకాష్ నగర్, దంసలాపురం ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించింది. మున్నేరు వరద కారణంగా నష్టపోయిన ఇళ్లను బృందం సభ్యులు పరిశీలించారు.
ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం సందర్శించింది. వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులను పరామర్శించింది.
మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయడంలో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, నష్టం అంచనాలపై ఈరోజు( మంగళవారం) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.
‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కలిసి తమ రెండు నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేస్తాం’’
ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ముంపు బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్లోని ప్రముఖ సాప్టువేర్ కంపెనీ హైసా (హెచ్వైఎ్సఈఏ) ముందుకొచ్చింది.