Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో రూ. 730 కోట్ల నష్టం
ABN , Publish Date - Sep 10 , 2024 | 09:36 PM
మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయడంలో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, నష్టం అంచనాలపై ఈరోజు( మంగళవారం) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఖమ్మం: మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయడంలో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, నష్టం అంచనాలపై ఈరోజు( మంగళవారం) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ALSO READ:CM Revanth Reddy: దేశంలోనే తెలంగాణ యంగెస్ట్.. ది ఫ్యూచర్ స్టేట్
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తాగునీరు విద్యుత్ రీ స్టోరేషన్లో సిబ్బంది పనితీరు అభినందనీయమని ప్రశంసించారు. నిత్యావసర సరుకులతో పాటు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశామని అన్నారు. హైసియా సాప్ట్వేర్ యాజమాన్యం రూ. 3 కోట్లతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.
ప్రభుత్వం తరఫున రూ. 16,500లు ఒక్కో వరద భాధిత కుటుంబానికి పంపిణీ చేస్తామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో రూ. 730 కోట్లు నష్టం వాటిల్లిందని సర్వే నివేదికలు వచ్చాయని చెప్పారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లిందని అన్నారు. పంట నష్టం పోయిన ఎకరాకు రూ 10 వేలు పరిహారం అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ALSO READ:Raghunandan: నేను ఎవరికీ వత్తాసు పలకను.... దేశం కోసమే మాట్లాడతా
చరిత్రలో ఎన్నడు లేని విధంగా మున్నేరుకు భారీగా వరద పోటెత్తిందని అన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయని ఆరోపించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొన్న జిల్లా యంత్రాంగానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..
CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు
Danam Nagender: బీఆర్ఎస్ చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?: దానం నాగేందర్