Home » KL Rahul
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని నుంచి వెనక్కి జరగడు. తాను నమ్మింది చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఇప్పుడూ ఓ ప్లేయర్ విషయంలో అతడు అలాగే వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
కేఎల్ రాహుల్ జంట గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో సినీ, క్రికెట్ వర్గాల నుంచే కాకుండా అభిమానులు కూడా ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు.
అసలే న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలాంటి తరుణంలో అతడికి మరింత తలనొప్పి తెప్పిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు కీలకంగా భావిస్తున్న స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోమారు నిరాశపర్చాడు. దారుణమైన ఆటతీరుతో పరువు తీసుకున్నాడు. అతడు ఔట్ అయిన తీరు చూస్తే షాక్ అవ్వక మానరు.
త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టులో చోటు దక్కించుకున్న పలువురు ఆటగాళ్లు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విఫలమయ్యారు. రిజర్వ్ ఓపెనర్‌గా చోటు దక్కించుకున్న అభిమన్యు ఈశ్వరన్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మైకేల్ నేసర్ అనే ఆసీస్ బౌలర్ ఈశ్వరన్‌ను ఖాతా తెరవకుండానే ఔట్ చేశాడు.
గత కొన్ని వారాలుగా వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. స్టార్ ప్లేయర్, గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)లను మాత్రమే యాజమాన్యం అట్టిపెట్టుకుంది.
ఎల్ఎస్జీ ఆఫర్ చేసిన టాప్ రిటెన్షన్ ఆఫర్‌ను కేఎల్ రాహుల్ వదలుకున్నట్టు తెలుస్తోంది. అతను తన వ్యక్తిగత కారణాల వల్ల లక్నో జట్టుకు నో చెప్పాడని సమాచారం.
కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నిలుపుదల చేసుకుంటుందా లేదా అనే సందేహాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. వ్యక్తిగతంగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడంతో పాటు జట్టును నడిపించడంలో కూడా ఆకట్టుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ విషయంలో యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది.
గత మూడు సీజన్ల నుంచి రాహుల్ లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. గత సీజన్ లో లక్నో చెత్త ప్రదర్శనతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ కారణాల వల్లే రాహుల్ ను రిటైన్ చేసుకునే ఆలోచనను లక్నో జట్టు పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది ఏ ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ను లఖ్‌నవూ రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.