Home » Kohli
2024 సంవత్సరానికి గానూ గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన వ్యక్తుల లిస్టు తాజాగా విడుదలైంది. అయితే, ఇందులో స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు గల్లంతవ్వడం గమనార్హం. ఇక ఈ ఏడాది దిగ్గజ ఆటగాళ్లను సైతం పక్కకు నెట్టి ఓ లేడి స్పోర్ట్స్ స్టార్ టాప్ స్థానంలో నిలిచింది...
సోషల్ మీడియాలో కోహ్లీ, అనుష్క దంపతులు క్రికెట్ ఆడుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. కోహ్లీతో కలిసి క్రికెట్ ఆడుతున్న అనుష్క.. అతడికి కొత్త రూల్స్ పెట్టింది. క్రికెట్‌లో ఆరితేరిన కోహ్లీ.. చివరకు భార్య చదివి వినిపించిన వింత రూల్స్ విని ఖంగు తినాల్సి వచ్చింది..
కింగ్ కోహ్లి మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పన రన్ మెషీన్.. తాజాగా మరో ఫీట్ సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి తప్ప మరే ప్లేయర్ ఇప్పటివరకు ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్- ఆర్సీబీ మధ్య జరుగుతోంది. ఓపెనర్ కోహ్లి 33 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని కుండబద్దలు..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో 79 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు 13,921 పరుగులు చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఒక పోస్టు పెట్టడానికి ఏకంగా రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడని హోపర్ హెచ్‌క్యూ(Hopper HQ) అనే సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం భారత జట్టుకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోయినప్పటికీ జిమ్‌లో తన కసరత్తులను మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం టీమిండియాకు నెల రోజుల పాటు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. దీంతో లేక లేక వచ్చిన సెలవులను వినియోగించుకుంటున్న ఆటగాళ్లంతా కుటుంబంతో యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. కోహ్లీ కూడా ఒక వైపు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తున్నాడు.
కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయాన్ని స్టాక్ గ్రో (Stock Gro) అనే సంస్థ వెల్లడించింది. స్టాక్ గ్రో నివేదిక ప్రకారం కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 1,050 కోట్లు. ప్రస్తుతం కెరియర్ను కొనసాగిస్తున్న క్రికెటర్లలో అత్యధిక ఆదాయం ఉన్నది విరాట్ కోహ్లీకే.
ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే కల మరోసారి చెదిరిపోవడాన్ని రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఫ్యాన్స్‌తోపాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఆదివారం గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో లీగ్ దశలోనే ఆర్సీబీ కథ ముగిసింది.