Share News

Google 2024: గూగుల్ టాప్ సెర్చ్ 2024 నుంచి కనుమరుగైన రోహిత్, కోహ్లీ.. అంతా వెతికింది ఆమె కోసమే..

ABN , Publish Date - Dec 10 , 2024 | 08:02 PM

2024 సంవత్సరానికి గానూ గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన వ్యక్తుల లిస్టు తాజాగా విడుదలైంది. అయితే, ఇందులో స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు గల్లంతవ్వడం గమనార్హం. ఇక ఈ ఏడాది దిగ్గజ ఆటగాళ్లను సైతం పక్కకు నెట్టి ఓ లేడి స్పోర్ట్స్ స్టార్ టాప్ స్థానంలో నిలిచింది...

Google 2024: గూగుల్ టాప్ సెర్చ్ 2024 నుంచి కనుమరుగైన రోహిత్, కోహ్లీ.. అంతా వెతికింది ఆమె కోసమే..
Google Top Search

గూగుల్ ఈ ఏడాది టాప్ టెన్ సెర్చెస్ లో 5 మంది క్రీడాకారులు ఉన్నారు. అందులో కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు లేవు. అంతేకాదు 2024 పారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా కూడా ఈ జాబితాలో లేకపోడం మరో విశేషం. అయితే, ఈ ఏడాది కెరీర్ పరంగా అనేక ఒడుదుడుకులను చూసిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఈ లిస్టులో టాప్ లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. పారిస్ ఒలింపిక్ ఫైనల్ లో చోటు సంపాదించిన ఏకైక క్రీడాకారిణిగా వినేశ్ నిలిచింది. రింగ్ లోకి మరికొన్ని గంటల్లో ఎంటర్ అవ్వనుందనగా బరువుకు సంబంధించిన కారణాలతో ఆమె డిస్ క్వాలిఫై అవ్వడం మొత్తం ప్రపంచం దృష్టిని వినేశ్ పై పడేలా చేసింది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పొగాట్.. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జులానా నుంచి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.


ఇక రెండో స్థానంలో హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఐపీఎల్ లో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ స్థానం నుంచి తొలగించడం పట్ల ఈ క్రికెటర్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అలా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఐపీఎల్ లో పంజాబ్ రిటైన్ చేసుకున్న ఇద్దరు ఆటగాళ్లలో శశాంక్ సింగ్ ఒకడు. గతేడాది పంజాబ్ అతడిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, తను తీసుకున్న జీతం కంటే శశాంక్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో అదే ఆటగాడిని ఈ ఏడు రూ. 5.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. దీంతో ఈ క్రికెటర్ వార్తల్లో నిలిచాడు.


ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరుకోవడంతో ఈ 24 ఏళ్ల కుర్ర క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచుల్లో 204.21 స్ట్రైక్ రేటుతో 484 పరుగులు చేశాడు. 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో ఒక సీజన్ లో 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.

Rohit Sharma: టీమిండియాకు ఓపెనర్ ఎవరు.. రోహిత్ త్యాగం జట్టుకు లాభమేనా..


Updated Date - Dec 10 , 2024 | 08:02 PM