Home » Kolkata Knight Riders
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2024(IPL 2024) రసవత్తరంగా సాగుతోంది. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే.. బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఫీల్డర్లు తమ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. చూస్తుండగానే 16 మ్యాచ్‌లు ముగిశాయి. జట్లన్నీ 3 మ్యాచ్‌ల చొప్పున ఆడేశాయి.
బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్ములేపింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో కేకేఆర్ ఆటగాళ్లు చెలరేగడంతో మ్యాచ్ వన్‌సైడేడ్‌గా ముగిసింది. 106 పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్‌కతా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 272/7 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2024(Ipl 2024)లో నేడు విశాఖపట్నం(Visakhapatnam)లోని వైఎస్సార్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ 2024లో ఢిల్లీకి ఇది నాలుగో మ్యాచ్ కాగా కోల్‌కతా మూడో మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్ 2024 షెడ్యూల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సింది.
ఈ సారి ఐపీఎల్ షెడ్యూల్, వేదికల విషయంలో బీసీసీఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సమస్యలు తప్పేలా లేవు. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ రెండు విడతల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 22 నుంచి ప్రారంభమైన లీగ్ మొదటి విడతలో 21 మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
కావ్య మారన్. క్రికెట్ ప్రేమికులకు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని అయిన కావ్య తన జట్టును ఎప్పుడూ సపోర్టు చేస్తుంటుంది. నిజానికి ఇందులో ప్రత్యేకత ఏం లేదు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో కేకేఆర్‌ను విజయం వరించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ బిగ్ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు. చాలా రోజుల తర్వాత ఐపీఎల్లో తన మార్కు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రస్సెల్ ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు ఉన్నాయంటనే అతని విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ సీజన్లో రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.