Home » Komati Reddy Venkat Reddy
లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ను కేవలం తెలంగాణలో ఎన్నికల ఖర్చుల కోసం రూ.7 వేల కోట్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆక్షేపించారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
జాతీయ రహదారులు రాష్ట్ర ప్రగతికి వెన్నెముకల్లాంటివని, వాటి నిర్మాణంంలో అలసత్వానికి తావివ్వొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. భూ సేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ పని చేయాలన్నారు.
మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే సాధారణంగా దక్కుతాయి. కానీ, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక వినూత్నంగా జరిగింది.
రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం జనవరిలో టెండర్లను ఆహ్వానించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
బీఆర్ఎస్కు భవిష్యత్ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని గమనించిన బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
‘‘వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎంతటి వారైనా అరెస్టు కాక తప్పదు. దాడిని ప్రోత్సహించిన బీఆర్ఎస్ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
అమృత్ 2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును భారత్‌కు తీసుకువస్తే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మండల పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామంలో అడ్వాన్డ్స్ పాట్ హోల్ జెట్ ప్యాచ్ మిషన్(రోడ్లపై గోతు లు పూడ్చే యంత్రం)ను ఆయన ప్రారంభించారు.
రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ ప్రజలపై భారం మోపిన కేసీఆర్ కనీసం రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
రహదారులు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టిమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తున్నారంటూ ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.