Komatireddy Venkat Reddy,: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం
ABN , Publish Date - Nov 14 , 2024 | 05:19 AM
‘‘వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎంతటి వారైనా అరెస్టు కాక తప్పదు. దాడిని ప్రోత్సహించిన బీఆర్‌ఎస్ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎంతటి వారైనా అరెస్టు కాక తప్పదు. దాడిని ప్రోత్సహించిన బీఆర్‌ఎస్ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై బీఆర్‌ఎ్‌సకు చెందిన ఓ రౌడీషీటర్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయని, అధికారం కోల్పోవడంతో ఒత్తిడిలో వారు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దాడికి పాల్పడిన నేతలు ఫోన్‌లో కేటీఆర్‌తో మాట్లాడినట్లు సమాచారం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపాలి తప్ప దాడులను ప్రోత్సహించవద్దన్నారు. దాడి ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ నుంచి అనుమతి రావాల్సింది ఉందని, ఆయన చేసిన అక్రమాలు బయట పడుతున్నాయనే ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు.