Home » Komati Reddy Venkat Reddy
అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. యూటర్న్ తీసుకున్నారు. తాను తిరిగి బీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్లు ప్రకటించారు.
మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజలపై ప్రేమ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) విమర్శించారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
అసెంబ్లీలో విద్యుత్తు అంశంపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మధ్య మాటల మంటలు రేగాయి. ఇరువురూ పరస్పరం తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.
బడ్జెట్‌పై చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది. హరీశ్.. కోమటిరెడ్డిని ‘హాఫ్ నాలెడ్జ్’ అని విమర్శించారు.
Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్ నాలెడ్జ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు అంటే.. రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
బీజేపీలో విలీనం దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోందని, ఆ మేరకు తనకు, ముఖ్యమంత్రికి సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Telangana: భవిష్యత్తులో బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ను ప్రజలు చీల్చి చండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక ఏడు సీట్లలో డిపాజిట్ కోల్పోయారని వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్‌కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ(శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సహా కీలక ప్రాజెక్టులకు గ్రీన్‌చానల్ ద్వారా నిధులిచ్చి రెండేళ్లలో పూర్తిచేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.