Home » Kotha Prabhakar Reddy
దేశంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటి వాళ్ళు వస్తారు... చెక్ చేసుకుంటారని అన్నారు. ‘‘మేము చెప్పేది చెబుతాం వాళ్ళు అడిగేది అడుగుతారు.. నా లెక్కలు క్లియర్ గా ఉన్నాయి కడిగిన ముత్యం లా వస్తాం’’ అని చెప్పుకొచ్చారు.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ సోదాలపై ఎంపీ స్పందిస్తూ... 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచి తనది వైట్ పేపర్ మీదనే ఉంటదని తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే వైట్ షీట్ అని స్పష్టం చేశారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.
సిద్దిపేట జిల్లా: తొగుట మండలం, రాంపూర్ కోటిలింగాల దేవాలయం వద్ద సోమవారం బీఆర్ఎస్ (BRS) ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
గ్యాస్ ధరను పెంచిన బీజేపీని గద్దె దించే వరకు తమ ఉద్యమం ఆగదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.