Kotha Prabhakar Reddy: ఎన్నికల ముందు బదనాం తప్ప మరేమీ లేదు.. ఐటీ సోదాలపై మెదక్ ఎంపీ
ABN , First Publish Date - 2023-06-14T12:58:00+05:30 IST
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ సోదాలపై ఎంపీ స్పందిస్తూ... 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచి తనది వైట్ పేపర్ మీదనే ఉంటదని తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే వైట్ షీట్ అని స్పష్టం చేశారు.
సిద్ధిపేట: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Medak MP Kotha Prabhakar Reddy) ఇంటిపై ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లోని లుంబిని ఎస్‌ఎల్‌ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో ఎంపీ ఉండే ఇంటితో పాటు కార్యాలయాలపైన ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ ఐటీ సోదాలపై ఎంపీ స్పందిస్తూ... 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచి తనది వైట్ పేపర్ మీదనే ఉంటదని తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే వైట్ షీట్ అని చెప్పుకొచ్చారు. తన ఇంటిపై ఐటి దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎన్నికల ముందు బదనాం చేయడానికి తప్ప మరేమి కాదన్నారు. వారు చేసే ఐటీ సోదాలో ఎలాంటి ఆధారాలు ఉండవన్నారు. తనకు ఎవరితో పొత్తులుండవు, వేరే దందాలుండవని తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడు లేని దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఇది కేవలం బురదజల్లే ప్రయత్నమని మండిపడ్డారు. తమ దగ్గర ఎన్ని ఆస్తులున్నా ఆధారాలతో సహా చూపిస్తానని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.