Home » KV Ramana Chary IAS
ప్రపంచం నుండి పరమాత్మవైపుకు మనస్సును మరల్చడమే దైవీయ చైతన్య గ్రంధాల లక్షణమని, మనిషిని సాధకునిగా, కార్య సాధకునిగా మార్చేది కేవలం స్తోత్ర మంత్ర సాహిత్యం మాత్రమేనని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా ప్రభుత్వ పూర్వ అధికారి కెవి రమణాచారి పేర్కొన్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్ త్యాగరాయగానసభలో ఆయన ఆవిష్కరించారు.
ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అందిన మూడు వందల పేజీల అమోఘ గ్రంధం ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంధాన్ని జంట నగరాల సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థలకు, వేద పాఠశాలలకు, అర్చకులకు, వేదపండితులకు ఉచితంగా వితరణ చేయనున్నట్లు ప్రఖ్యాత సాంస్కృతిక కళా వేదిక ‘త్యాగరాయ గాన సభ’ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి పేర్కొన్నారు. గురుపూర్ణిమకు ముందు రోజున ఈ మంగళగ్రంధాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారి ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.