LK Advani: అద్వానీకి మళ్లీ అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు
ABN , Publish Date - Dec 14 , 2024 | 10:42 AM
బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్‌కెే అద్వానీ శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ హోం శాఖ మంత్రి ఎల్‌కెే అద్వానీ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు.. ఆయన్ని తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన్ని ఉంచారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. 97 సంవత్సరాల అద్వానీ వయస్సు రీత్య ఇటీవల పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆయన్ని పలుమార్లు మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు తరలించిన విషయం విధితమే.
Also Read: అల్లు అర్జున్ అరెస్ట్‌పై చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు
అటల్ బిహారి వాజపేయ్ ప్రభుత్వంలో ఎల్‌కెే అద్వానీ కీలకంగా వ్యవహరించారు. 2002 నుంచి 2004 వరకు దేశానికి ఉప ప్రధానిగా ఆయన పని చేశారు. అలాగే 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ ఏర్పాటులో అద్వానీ అత్యంత కీలకంగా వ్యవహరించారు. అయితే 2014 నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read: పోలీస్ వాహనంపై దాడి.. ప్రధాన నిందితుడిని ఎత్తుకెళ్లిన ముఠా
Also Read: దుర్గమ్మను దర్శించుకొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది.. ఎల్‌కెే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. దీంతో ఈ ఏడాది మార్చిలో దేశ అత్యున్నత పురస్కారాన్ని అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. మరోవైపు గతంలో ఎల్‌కెే అద్వానీ అనారోగ్యంపై సమాచారం అందుకున్న ప్రధాని మోదీ.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన విషయం విధితమే. భారత దేశ విభజనకు ముందు.. ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో ఎల్‌కెే అద్వానీ జన్మించిన సంగతి తెలిసిందే.
For National News And Telugu News