Home » Lok Sabha Polls 2024
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదని.. పాకిస్థాన్ అంటే ఆ పార్టీ భయపడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) సంచలన విమర్శలు చేశారు.
దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ఏపీలో ఫలితాలు రానున్నాయని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2019 లో వచ్చిన ఫలితాలే తిరిగి పునరావృతం కానున్నాయని తెలిపారు. జూన్ 9వ తేదీన ఉదయం 9.35 నిమిషాలకు రుషికొండలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.
‘మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు!? అక్కడి (పాకిస్థాన్)(Pakistan) నుంచి వారికే ఎందుకు మద్దతు లభిస్తుంది!? ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి’’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌ను(Kejriwal) ఉద్దేశించి ప్రధాని మోదీ(PM Modi) వ్యాఖ్యానించారు.
హత్యాయత్నం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) బెయిల్ మంజూరు చేయడంపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు(AP High Court). రెండు హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పూర్వాంచల్ ప్రాంతంలోని ఘోసిలో జరిగిన లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రచారంలో ఆయన మాట్లాడారు.
ఆమె సినిమా ‘క్వీన్’.. ఆయన ఒకనాటి రాజ్యానికి వారసుడు..! వీరి మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ కాక పుట్టిస్తోంది. ఇద్దరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తూ ఆదరణ చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం మండి. ఇక్కడినుంచి బీజేపీ
ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చెబితే గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ.. ఆ ఇద్దరు ఓటు ఎవరికి వేస్తారని ఎవరిని అడిగినా వెంటనే వచ్చే సమాధానం కాంగ్రెస్ పార్టీ.. హస్తం గుర్తు.. కానీ ఈ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలు హస్తం గుర్తుకి ఓటు వేయలేదు.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. లోక్‌సభకు శనివారం జరుగుతున్న 6వ దశ పోలింగ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే..