Gorantla Madhav: దేశం మొత్తం నిర్ఘాంత పోయేలా ఏపీ ఫలితాలు..
ABN , Publish Date - May 28 , 2024 | 12:32 PM
దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ఏపీలో ఫలితాలు రానున్నాయని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2019 లో వచ్చిన ఫలితాలే తిరిగి పునరావృతం కానున్నాయని తెలిపారు. జూన్ 9వ తేదీన ఉదయం 9.35 నిమిషాలకు రుషికొండలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.
తిరుమల: దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ఏపీలో ఫలితాలు రానున్నాయని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2019 లో వచ్చిన ఫలితాలే తిరిగి పునరావృతం కానున్నాయని తెలిపారు. జూన్ 9వ తేదీన ఉదయం 9.35 నిమిషాలకు రుషికొండలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను సైతం ఎద్దేవా చేశారు. ఆయన ప్రశాంత్ కిషోర్ కాదని.. ప్రశాంతి కిషోర్ అని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీ వైపు చేరి ప్రశాంతి కిషోర్‌గా మారిపోయాడన్నారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు భారీగా పందేలు కాస్తున్నారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత టీడీపీ నాయకులకు నిరాశ తప్పదని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.
Agnibaan: అగ్నిబాణ్ ప్రయోగం.. కౌంట్‌డౌన్ చివరి దశలో ఊహించని ట్విస్ట్
Read more AP News and Telugu News