Home » Lucknow
మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు కారణంగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి నిలిచారు. ఆయన కుమారుడు, కైసర్‌గంజ్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ నేత కరణ్ భూషణ్ సింగ్.. ప్రయాణిస్తున్న కాన్వాయ్ గొండ నగర సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
'ఇండియా' కూటమి జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకూ పూర్తయిన నాలుగు విడతల పోలింగ్‌లో విపక్ష కూటమి స్ట్రాంగ్ పొజిషన్లో నిలిచిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సాగనంపడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అకతాయిల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. ఎయిర్ పోర్టులు, పాఠశాలలు, ఆసుపత్రులకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో ఆ సమయంలో సదరు సంస్థల సిబ్బంది పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని గోమతి నగర్లో పలు పాఠశాలలకు సోమవారం ఉదయం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్ర్తాలు సంధించారు. ‘‘మోదీ.. టెంపో బిలియనీర్ల’’ చేతిలో ‘తోలుబొమ్మ రాజు’ అంటూ ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్ టెంపోల్లో నగదు పొందుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై రాహుల్ గాంధీ శనివారం మరోసారి విరుచుకుపడ్డారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు మరోసారి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది.
లఖ్‌నవూ లోకసభ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నామినేషన్ వేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామితోపాటు యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ఉన్నారు. అంతకుముందు లఖ్‌నవూ నగర పుర వీధుల్లో రాజ్‌నాథ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోడ్ షో ప్రారంభానికి ముందు స్థానిక హనుమాన్ సేతు దేవాలయంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అతనో నిత్య విద్యార్థి నాయకుడు. తన 40ఏళ్ల నాయకత్వ కెరీర్లో 251 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
నేడు ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు 34వ మ్యాచ్ మొదలు కానుంది. ఈ కీలక మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Cricket Stadium)లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ టీం ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
లోక్‌సభ ఎన్నికలు, పండుగల సీజన్ కావడంతో మే 17వ తేదీ వరకూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లో 144 సెక్షన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శాంతిభద్రత విభాగం జేసీపీ ఉపేంద్ర కుమార్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.